తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుల వృత్తుల మనుగడకు సీఎం కేసీఆర్ పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.10 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.
ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగాయిపల్లి కాలనీలో గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పౌల్ట్రీఫాం మాదిరిగానే గొర్రెల పెంపకానికి ప్రోత్సాహకాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
మొదటి విడతలో రూ.5 వేల కోట్లతో గొర్రెల యూనిట్లు అందించామని, రెండో విడతలో రూ.10 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఒక్కో యూనిట్‌కు రూ.1.75 లక్షలతో 20 గొర్రెలు, ఒక పొట్టేలు పిల్లను అందించనున్నట్టు వివరించారు.