Home / MOVIES / బిగ్ బాస్ ఎంట్రీపై బ్యూటీ క్లారిటీ

బిగ్ బాస్ ఎంట్రీపై బ్యూటీ క్లారిటీ

ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఆ త‌ర్వాత ఫేడ్ ఔట్ అయిన వారికి బిగ్ బాస్ ఓ వ‌రంగా మారుతుంది. ఈ షో ద్వారా మ‌ళ్లీ జ‌నాల‌లో బాగా గుర్తింపు ద‌క్కుతుంది. ఈ క్ర‌మంలోనే అవ‌కాశాలు రాక ఖాళీగా ఉన్న స్టార్స్ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. తెలుగులో సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుండ‌గా, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ ఓ లిస్ట్ చ‌క్క‌ర్లు కొడుతుంది.

యాంకర్ రవి, వర్షిణి, సిరి హన్మంత్, జబర్దస్త్ సాయి తేజ(ప్రియాంక సింగ్), నవ్యస్వామి, విష్ణుప్రియ, సీరియల్ నటి ప్రియ, సీనియర్ హీరోయిన్ ప్రియా రామన్, సీరియల్ హీరో మానస్, హీరోయిన్ ఇషా చావ్లా, లోబో, యూట్యూబర్ సరయు, సురేఖా వాణి ఇలా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో కొంద‌రు దీనిపై స్పందిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు లైట్ తీసుకుంటున్నారు.

ఇప్ప‌టికే సురేఖా వాణి, యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి ఎంట్రీపై క్లారిటీ రాగా తాజాగా ఇషా చావ్లా బిగ్ బాస్ షోకి వ‌స్తుందా రాదా అనే దానిపై పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది. నెటిజన్లు బిగ్ బాస్ ఎంట్రీ గురించి ప్రశ్నలు సంధిస్తుంటే.. తాజాగా వాటికి సమాధానాలు చెప్పారు. తాను బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదని అసలు విషయం చెప్పేశారు. దీంతో లిస్ట్‌లోంచి ఓ కంటెస్టెంట్ పేరు తగ్గినట్టైంది. మ‌రి లీకు వీరులు ఆమె స్థానంలో ఎవ‌రి పేరు యాడ్ చేస్తారో చూడాలి. ఇషా చావ్లా సాయికుమార్ త‌న‌యుడు ఆది హీరోగా వ‌చ్చిన ప్రేమ కావాలి సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యమైన విష‌యం తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat