భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,643 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 464 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 42,096 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 4,14,159 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3.1 కోట్ల మంది. దేశంలో ఇప్పటి వరకు 49.53 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.