తెలంగాణ రాష్ట్ర సాధనలో దివంగత ఆచార్య జయశంకర్ ఒక దిక్సూచి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టిన రోజున ఆచార్య జయశంకర్ సార్ మార్గదర్శనం చేసారని ఆయన కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదలైన తొలి ఉద్యమంలో ఆయన పాత్ర అజరమారంగా నిలుస్తుందని ఆయన తెలిపారు.దివంగత ఆచార్య జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని సూర్యపేట జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు.
ఆయన చిత్రపటానికి పులమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతెలంగాణ ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జయశంకర్ సార్ అని తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆయన లేకపోవడం అన్న బాధ వెంటాడుతున్న ఆయన ఆలోచన విధానం మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.