Home / SLIDER / రెండున్నర గంటలు.. 4.5 కిలోమీటర్ల నడక

రెండున్నర గంటలు.. 4.5 కిలోమీటర్ల నడక

వాసాలమర్రి గ్రామంలో మీదివాడ, కిందివాడ పేరుతో రెండు ఎస్సీవాడలున్నాయి. మొత్తం 76 కుటుంబాలు ఉన్నాయి. మీదివాడ.. ఊరికి తూర్పువైపున, కిందివాడ ఊరికి పడమర దిక్కు ఉన్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల సీసీరోడ్లు ఉండగా, మరికొన్ని గల్లీల్లో మట్టిరోడ్లు మాత్రమే ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ తన పర్యటనను కిందివాడ నుంచి ప్రారంభించారు.

మీదివాడను, కిందివాడను అనుసంధానం చేసే సీసీరోడ్డు మీదుగా సీఎం పర్యటిస్తారని అధికారులు భావించారు. కానీ వారి అంచనాకు భిన్నంగా సీఎం కేసీఆర్‌ మట్టి రోడ్ల వెంబడి నడిచారు. దాదాపు అన్ని గల్లీలను పరిశీలించారు. కనిపించిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడారు. మధ్యలో వచ్చిన ఇతర కాలనీల్లోనూ కలియదిరిగారు. మట్టిరోడ్ల మీదుగా, ఇరుకు గల్లీల్లో సీఎం పర్యటన సాగింది.

ఇటీవలి వర్షాలకు ఆ మట్టిరోడ్లు కోసుకుపోయి కయ్యలు పడ్డాయి. కనిపించిన ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ.. పెన్షన్‌ వస్తున్నదా? 24 గంటల కరెంటు ఉన్నదా? రైతుబంధు డబ్బులు వస్తున్నయా? ఏమేం పంటలు వేస్తున్నరు? అని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సుమారు నాలుగైదు కిలోమీటర్ల మేర సీఎం నడుచుకొంటూ తిరిగారు. అయినా ఏమాత్రం అలిసిపోలేదు. ఈ రెండున్నర గంటల్లో కనీసం ఎక్కడా కూర్చోలేదు కూడా. పర్యటన మొత్తం ఆయన చాలా ఉత్సాహంగా కనిపించారు. పర్యటనలో పాల్గొన్న యువ అధికారులు కూడా సీఎం వేగాన్ని అందుకోలేకపోయారు.

సీఎం: నీ పేరేందమ్మా
నాగపురి పెంటమ్మ సారు
సీఎం: ఎందరు ఉంటరు ఇంట్ల?
ఒక్కదాన్నే ఉంట సారు. పిల్లలు పట్నంల పనికిపోతున్నరు.
సీఎం: ఏం కావాలె నీకు మరి?
ఇల్లు కావాలె సారు. పెంకల ఇల్లు. పాత గోడలు. కూలిపోతున్నది.
సీఎం: వస్తదమ్మా.. ఈ మేడమ్‌ మీ కలెక్టర్‌. ఇప్పుడు రాసుకుంటున్నరు. మళ్లా మీ ఊరికి వస్తరు. ఎవరికి ఏమేం కావాల్నో అడిగి తెలుసుకుంటరు.

లేత్‌ మిషన్‌ మంచి ఆలోచన..

సీఎం: లక్ష్మి మంచిగున్నవా అమ్మ!
చిన్నూరి లక్ష్మి: మంచిగున్న సారు. మా ఇంటాయినె మొగిలయ్య. అల్లుడు పోషయ్య.
సీఎం: పోషయ్యా.. నీకు ప్రభుత్వం సాయం ఇస్తే ఏం చేస్తవ్‌?
ఏదో ఒకటి చేసుకుంట సారు.
సీఎం: ఏదో ఒకటి అంటే.. భూమా? ఆకాశమా? గట్లుంటదా? ఆలోచన చెయ్యాలె కదా.
లేత్‌ మిషిన్‌ పెట్టుకుంట సార్‌.
సీఎం: ఈ మిషిన్‌ పని నీకు పర్ఫెక్టుగా వస్తదా?
వస్తది సార్‌. ఇంతకుముందు పనిచేశిన.
సీఎం: మరి.. లేత్‌ మిషన్‌ పెట్టుకుంటే రోజుకు ఎంత సంపాదిస్తవ్‌?
రోజుకు రెండుమూడు వేలు వస్తది సార్‌.
సీఎం: మంచి ఆలోచన.. మీటింగ్‌ కాడికి రాండ్రి. మొత్తం మాట్లాడుకుందాం.

డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇప్పిస్తా

సీఎం: ఇదేనా అమ్మా మీ ఇల్లు?
బొల్లారం దశరథం, లావణ్య: ఇదే సారు.. మాకు ఈ గుడిశె ఒక్కటే ఉన్నది.
సీఎం: ఎప్పటి సంది ఉంటున్నరు?
నాకు పెండ్లయినకాడి నుంచి ఈ గుడిశెలనే ఉంటున్నం సారు. పురుగుపూశి వస్తున్నది. అయినా ఇండ్లనే సర్దుకుంటున్నం.
సీఎం: మీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా. మీకు కచ్చితంగా డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇప్పిస్తా.

అందరూ కూసొని మాట్లాడుకోండ్రి

సీఎం: నీ పేరేంది?
జెర్రిపోతుల రాములు
సీఎం: దళితబంధు పథకం కింద మీ ఇంటికి రూ.10 లక్షలు ఇస్త.. ఆ డబ్బులతోని ఏం చేస్తరు మరి? బోరు ఏసుకుంటం సారు.
సీఎం: గట్లుంటదా?. బోరంటే రూ.75 వేలతోని అయిపోతది. మిగిలిన పైసలు ఏం చేస్తవ్‌?
ఏం చేస్తమంటే…
సీఎం: అంటే మీరు ఆలోచన చెయ్యలే. తెల్లారి మన చేతుల పైసలు పడితే ఏం చేయాలనే ఇగురం లేదు. దళితబంధు గురించి మీటింగ్‌ల గంత మొత్తుకుంటి కదా. పైసలకు మీరే జిమ్మెదారి అంటిని కదా. ఇన్నరా లేదా? ముందుగాళ్ల మీ ఇంట్లో అందరూ కూసొని మాట్లాడుకోండ్రి. మీకేం పని వస్తది? ఏం చేసుకుందాం? అని ఆలోచన చెయ్యిన్రి.

సర్కారు దవాఖానల మంచి వైద్యం

సీఎం: ఇంట్ల ఎవరెవరు ఉంటరు?
జెర్రిపోతుల నర్సమ్మ: నేనొక్కదాన్నే. కొడుకులు లేరు. బిడ్డకు పెండ్లయింది.
సీఎం: మరి నీకు పింఛన్‌ వస్తున్నదా?
వస్తున్నది సారు. రెండువేల పదార్లు వస్తున్నది.
సీఎం: మరి దాంట్ల ఏమన్నా దాశిపెట్టినవా? ఖర్చుపెట్టినవా?
యాడున్నయ్‌ సారు.. ఏం లెవ్వు.
సీఎం: నేనేం గుంజుకపోతనా ఏంది? (నవ్వుతూ). ఏమన్నా దాశిపెట్టుకున్నవా? లేదా అని తెలుసుకుందామని అడిగిన.
దాశి పెట్టుకున్నయి దవాఖానలకే అయిపోతున్నయి సారు.
సీఎం: ఎందుకు అయిపోతయి.. ప్రైవేటుకు పోతున్నవా? సర్కార్లు దవాఖానకు పోతే ఫ్రీగా వైద్యం అందుతది కదా? ఈ వయసుల వచ్చిన పింఛన్‌ నుంచి కొంత దాశిపెట్టుకుంటే నీకే మంచిది కదా!
అవును సారు.
సీఎం: నువ్వు తుర్కపల్లికి పో. సర్కారు దవాఖానల మంచి వైద్యం ఇస్తరు.
రేషన్‌ దుకాణంల బియ్యం వస్తున్నయా?
వస్తున్నయి సారు. మనిషికి ఆరు కిలోలు.
సీఎం: ఇప్పుడు పైసలు తీసుకుంటున్నరా? ఫ్రీగా ఇస్తున్నరా?
రెండునెలల నుంచి పైసలేం తీసుకుంటలేరు సారు.

అల్లుడిని రమ్మనుర్రి.. ట్రాక్టర్‌ ఇప్పించే పని చూస్త..

సీఎం: మీ పేరేంది?
జెర్రిపోతుల పోషమ్మ, సంజీవ
సీఎం: ఈమె మీ పాపనా?
అవును సారు.. ఎంగేజిమెంట్‌ అయ్యింది. ఈ నెలలనే పెండ్లి ఉన్నది.
సీఎం: మరి కల్యాణలక్ష్మికి దరఖాస్తు పెట్టినరా?
పెట్టలేదు సారు. పెట్టాలె.
సీఎం: ఇంకా ఎందుకు పెట్టలేదు. ఏమన్నా కట్నం ఇస్తున్నవా మరి?
కట్నం పెద్దగ ఏం లేదు గానీ.. అల్లుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌. సొంతంగా
కొనుక్కుంటా అనుకొంటున్నడు.
సీఎం: అవునా? మీ అల్లునోళ్ల ఊరు దగ్గర్నే ఉంటదా?
దగ్గర్నే సారు.
సీఎం: ఆయనను రమ్మనుర్రి. ట్రాక్టర్‌ ఇప్పిచ్చే సంగతి నేను చూసుకుంటా.

నిమ్మలంగా తిని ఉండుర్రి

దుబ్బాక బాలమ్మ: సారూ.. నాకు కండ్లు సక్కగ కనవడయి. మా ఇంటాయినెకు పానం సక్కగుండది.
సీఎం: మరి ఏం కావాలె మీకు?
మీ ఇష్టం సారు.
సీఎం: మీ ఇద్దరికీ పానం సక్కగలేదు. ఈ వయసుల ఏం తిప్పలు పడుతరు. పింఛన్‌ వస్తున్నదా?
వస్తున్నది సారు.
సీఎం: ఎంతొస్తున్నది?
రెండువేల రూపాయలు వస్తున్నయి సారు.
సీఎం: మరి ఇంతకుముందు ఎంత వస్తుండే?
రూ.200 వస్తుండె.
సీఎం: మరి ఇప్పుడు 2 వేలు వస్తున్నయి కదా. మొత్తం కర్సు వెడుతున్నరా? ఏమన్నా కూడవెట్టుకుంటున్నరా?
దాశిపెట్టుకున్న పైసలతోటి ఈ ఇల్లు కట్టుకున్న సారు. అయిపోయినయి.
సీఎం: వచ్చే పింఛన్‌ పైసలతోని నిమ్మలంగా తిని ఉండుర్రి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat