పెగాసస్ స్పైవేర్ ( Pegasus Snooping) నిఘా అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై వ్యక్తిగత విచారణ చేపట్టాలని, హ్యాకింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలను బహిర్గతం చేయాలని ఇప్పటి వరకు సుప్రీంలో 9 పిటిషన్లు దాఖలు అయ్యాయి.
పిటీషన్ వేసినవారిలో అడ్వాకేట్ ఎంఎల్ శర్మ, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్, ద హిందూ గ్రూపు డైరక్టర్ ఎన్ రామ్, ఆసియానెట్ ఫౌండర్ శవి కుమార్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, జగదీప్ చోకర్, నరేంద్ర మిశ్రా, రూపేశ్ కుమార్ సింగ్, ఈప్సా శతాక్షి, పరంజయ్ గుహ్ థాకుర్త, ఎస్ఎన్ఎమ్ అబ్ధి, ప్రేమ్ శంకర్ జాలు ఉన్నారు.