లాడ్జి వ్యవహారం అంటూ క్యూ న్యూస్‌లో తీన్మార్ మల్లన్న వాడిన భాషపై బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఓ వీడియోను విడుదల చేసిన యువతి తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్‌కుమార్‌పై విరుచుకుపడింది. లాడ్జి వ్యవహారం అని ఎట్లా అంటావని ప్రశ్నిస్తూ, చెప్పుతో కొడ్తానని తీవ్రంగా మండిపడింది.
‘న్యూస్‌లో నా ఫొటోలు ప్రసారం చేసేకంటే ఒక రోజు ముందు ఏదైనా ఉంటే మీరు మీరే చూసుకోండి అని మెస్సేజ్ పెట్టిన. అయినా మార్నింగ్ న్యూస్‌లో అమ్మాయిలను బద్నాం చేస్తూ ప్రసారం చేశాడు. క్యూ న్యూస్‌లో పనిచేస్తున్నపుడు మల్లన్న నాపై నిఘా పెట్టి వేరే వాళ్లతో ఫోన్ చేయించి తన గురించి తానే అడిగిపించాడు.
ఎందుకురా భయ్ వాడితో తిరుగుతావ్ అని వాళ్లకు చెప్పిన. అలా అన్నందుకు నన్ను టార్గెట్ చేశాడు. ఆ రికార్డులు అతని వద్ద ఉన్నాయి. నేను అబ్బాయితో సెల్ఫీ దిగితే తప్పా?మనం ఏ జనరేషన్లో ఉంటున్నాం? మల్లన్నా.. నీతో కూడా నీ కొత్త ఒప్పో ఫోన్లో సెల్ఫీ దిగాను. దీనికి ఏమంటావ్? ప్రశ్నిస్తా అన్నావ్. ప్రశ్నించే వేదికను అమ్ముకున్నావ్. క్యూ న్యూస్ ఆఫీస్‌ను అక్రమాలకు అడ్డాగా మార్చి, ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నావ్’ అని తీన్మార్ మల్లన్నపై బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది.