Home / CRIME / తీన్మార్‌ మల్లన్నకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు

తీన్మార్‌ మల్లన్నకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు

తీన్మార్‌ మల్లన్నపై ఈ ఏడాది ఏప్రిల్‌ 22న చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. క్రైం నంబర్‌ 197/2021లో ఐపీసీ సెక్షన్‌ 387, 504 కింద కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు ఆయనకు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురంలోని ఇంటినంబర్‌ 2-79కు నోటీసులు పంపించారు. ఈ నోటీసుల ప్రకారం పోలీసుల ముందు హాజరు కాకపోతే సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 ఏ(3),(4) కింద అరెస్టు చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు.

పలు కేసులు

  • తీన్మార్‌ మల్లన్న గతంలో ఒక చానల్‌లో పని చేస్తున్నపుడు అద్దెకు ఉండే ఇంటి ఓనర్‌పై లైంగిక దాడి చేయబోయాడు. దీంతో ఆ యాజమాని బంధువులు మల్లన్నను చితకబాది ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
  • తీన్మార్‌ మల్లన్న తన భార్య పేరుతో చిట్స్‌ నడిపి 76 మంది అమాయక మహిళలను మోసం చేసి రూ.3 కోట్లతో పారిపోయి ఏపీలోని మంగళగిరి దగ్గర ఒక గ్రామంలో తలదాచుకుంటే టాస్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి మూడు నెలలు జైలుకు పంపించారు.
  • మల్లన్న బంధువు ఒకరు ఇద్దరు మహిళలను తప్పుడు పత్రాలతో దుబాయ్‌కి పంపిస్తుంటే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేశారు.
  • ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు డబ్బుల కోసం ఓ బ్యాంకు ఉద్యోగి భూమిని తప్పుడు పత్రాలతో ఏపీకి చెందిన మాజీ మంత్రికి తనఖా పెట్టాడు. ఆ కేసు సిటీ సివిల్‌ కోర్టులో నడుస్తున్నది.
  • పార్టీ పెట్టడానికి ముందే తన టీంలో దీర్ఘకాలిక రోగాలున్న కొందరికి భారీగా డబ్బిచ్చి ఆత్మహత్య చేసుకోవాలని ఉసిగొల్పాడని, తెలంగాణవాదాన్ని రెచ్చగొట్టి తాను పెట్టబోయే పార్టీకి సానుభూతి పొందాలని కుట్ర చేస్తున్నాడని ముగ్గురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat