తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 ఏండ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన వాళ్లందరికి పెన్షన్లు అందిస్తామన్నారు.
ఈ నిర్ణయంతో కొత్తగా మరో 6,62,000 మందికి ప్రతి నెలా రూ. 2016 వృద్ధాప్య పెన్షన్ అందనున్నదని మంత్రి తెలిపారు.ఈ మేరకు తమ శాఖ అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 ఏ0డ్లు నిండిన అర్హత ఉన్న వాళ్లందరికి పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. రైతుబంధు బీమా తరహాలోనే మరికొద్ది రోజుల్లోనే నేత, గీత కార్మికులకు కూడా బీమా ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటనను విడుదల చేశారు.సీఎం చేతుల మీదుగా ఈ కొత్త పెన్షన్లు ప్రారంభిస్తామని ఆయన అన్నారు.