దేశంలో ఈ నెల నుంచే కరోనా థర్డ్‌వేవ్ (మూడో ఉద్ధృతి) ప్రారంభమయ్యే అవకాశమున్నదని పరిశోధకులు తెలిపారు. అక్టోబర్‌లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరవచ్చని పేర్కొన్నారు. ఈ సమయంలో రోజువారీ కేసులు గరిష్ఠంగా లక్షన్నర వరకు నమోదవ్వచ్చని అంచనా వేశారు.
అయితే, సెకండ్‌వేవ్‌తో పోలిస్తే, థర్డ్‌వేవ్ తీవ్రత తక్కువేనని తెలిపారు. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ మతుకుమల్లి విద్యాసాగర్, ఐఐటీ కాన్పూర్‌కు చెందిన మణీంద్ర అగర్వాల్ మ్యాథమెటికల్ మోడల్‌ను రూపొందించారు.
కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న కేరళ, మహారాష్ట్ర.. పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదమున్నదన్నారు. ఆంక్షల సడలింపులు, డెల్టా వేరియంట్ విజృంభణ కేసుల పెరుగుదలకు కారణమని అభిప్రాయపడ్డారు. కాగా, దేశంలో సెకండ్‌వేవ్ సరళి, తీవ్రతపై గతంలో ఈ బృందం వేసిన అంచనాలు నిజమయ్యాయి.