పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ చేయబోతోందని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ పూర్తిచేసిన ప్రభాస్, ప్రస్తుతం ‘సలార్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.
హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ని మేకర్స్ సంప్రదించారట. బాలీవుడ్లో క్రేజీ మూవీస్ చేస్తున్న కత్రినా, స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రభాస్ ‘సలార్’ మూవీలో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. తెలుగులో విక్టరీ వెంకటేశ్‌తో ‘మల్లీశ్వరి’ సినిమా చేసి సౌత్‌లో క్రేజ్ తెచ్చుకుంది. చాలాకాలానికి మరోసారి సౌత్‌లో సందడి చేయడానికి కత్రినా ఒకే చెప్పిందట. అయితే ఈ విషయంలో అధికారంగా మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.