బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరో ఛాలెంజింగ్ రోల్‌లో నటించబోతోందని తాజాగా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది.
‘పేపర్ బాయ్’, ‘విటమిన్-షి’ సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్. ఆయన ఓ ఆంథాలజీ మూవీని తెరకెక్కించనున్నాడు. ఇదీ 6 కథల సమ్మేళనం ఉంటుందట.
ప్రతి కథలో ఒక ప్రముఖ నటీనటులు లీడ్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అనసూయ కూడా ఓ కథలో లీడ్ రోల్ పోషిస్తుందని, ఆ రోల్ ఎయిర్ హోస్‌గా అని సమాచారం. ఆగస్టు నుంచి ఈ సినిమా చిత్రీకరణలో అనసూయ జాయిన్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇక కృష్ణంవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగ మార్తాండ’, రవితేజ ‘ఖిలాడి’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్‌ల పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప’ లలో నటిస్తోంది.