కోవిడ్ సమయంలో ఎందో ఆపన్నులకు సాయం చేసి తన పెద్ద మనసు చాటుకోవడమే కాకుండా.. అత్యవసర సమయాల్లో పేదలకు అండగా నిలబడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నబాలీవుడ్ స్టార్ సోనూసూద్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది.
వచ్చే ఏడాది రష్యాలో జరగబోయే స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్‌కు భారత్ తరపున సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఇది తనకెంతో ప్రత్యేకమని, స్పెషల్ ఒలింపిక్స్ భారత్ జట్టు తరపున చేరినందుకు ఆనందంగా, గర్వంగా ఉందని సోనూసూద్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు సోనూసూద్.