సీఎం కేసీఆర్ పాలనలో గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి బాటలు పడ్డాయని అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి, ఓయూ జేసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాంయాదవ్ అన్నారు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే యాదవులకు మంచి రోజులు వచ్చాయన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలం అంబాలలో యాదవ మహాసభ గ్రామ అధ్యక్షుడు బోయిని చంద్రమౌళితోపాటు కమిటీ సభ్యులు టీఆర్ఎస్కు మద్దతు పలుకుతూ తీర్మానం చేశారు.
ఈ ప్రతిని శనివారం వారు అంబాల గ్రామంలో రాజారాంయాదవ్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు, కల్యాణలక్ష్మి తదితర పథకాలు అందించి అండగా నిలిచిందని కొనియాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నేపల్లి శ్రీనివాస్ యాదవ్,రమేశ్, యోగేందర్ యాదవ్, భిక్షపతి, కొమురయ్య, సమ్మయ్య, కిషన్, మొగిలి తదితరులు పాల్గొన్నారు.