దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. మరోసారి 41వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 41,831 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా మరో 39,258 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 3,08,20,521 మంది డిశ్చార్జి అయ్యారు.
కొత్తగా 541 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,24,351కి చేరింది.ప్రస్తుతం దేశంలో 4,01,952 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 47,02,98,596 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.36 శాతానికి చేరుకుందని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.30శాతంగా ఉన్నాయని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.42శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 2.34 శాతంగా ఉందని వివరించింది.