యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఇందులో నటిస్తున్న హీరోయిన్‌ని చిత్ర బృందం రివీల్ చేసింది. కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 70ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.
కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీలో ఆనంది సోడాల శ్రీదేవిగా నటిస్తోంది. సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె లుక్ రిలీజ్ చేశారు.
ఇక ఆమెని పరిచయం చేసిన సందర్భంగా హీరో సుధీర్ బాబు “తట్టుకోలేనంత కోపం, పట్టలేనంత ప్రేమ” అంటూ టీట్ చేశాడు. కాగా ఆనంది ‘జాంబీ రెడ్డి’ సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఆమెకి ‘శ్రీదేవి సోడా సెంటర్’లో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. చూడాలి ఆమెకి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో.