ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఆగస్టు 14 వరకు కర్ఫ్యూను పొడిగించింది ఏపీ ప్రభుత్వం..
ఇందులో భాగంగా రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూను అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. కర్ఫ్యూ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, సీపీలను ప్రభుత్వం ఆదేశించింది.