హుజురాబాద్ నుంచి ప్రవేశపెట్టనున్న పథకాలన్నీ గత బడ్జెట్‌లోనివేనని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
ఈ జిల్లాకు సంబంధించిన మంత్రితో ప్రజల ముందు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మైక్ లాక్కుని చేసిన పని సరైంది కాదన్నారు. హుజురాబాద్‌లో ప్రవేశపెట్టిన పథకాలన్నీ గత బడ్జెట్లో పెట్టినవే.
ఇప్పుడు అమలు చేస్తున్నాం తప్ప ఎన్నికల కోసం ఆర్భాటంగా చేసిన పథకాలు కావని గుత్తా స్పష్టం చేశారు. ప్రతి పక్షాలు అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఇకనైనా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విలువైన సూచనలు చేయాలని హితవు పలికారు.