దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 555 మంది మరణించారు. కరోనా మహమ్మారి నుంచి 42,360 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
దేశంలో ఇప్పటి వరకు 3,15,72,344 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 4,05,155 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,07,43,972. మరణాల సంఖ్య 4,23,217కు చేరింది. ఇక 45.60 కోట్ల మందికి పైగా కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు.