హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే అని టీఆర్‌ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, లండన్ కార్యవర్గ సభ్యులతో కలిసి హుజురాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. రాబోయే ఉపఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీమెజారిటీ తో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నది.ప్రతిపక్షాలుమాత్రం వారి రాజకీయ లబ్ధికోసం నీతిమాలిన విమర్శలు చేస్తున్నారని అనిల్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వం ఉంటేనే రైతుబంధు, దళితబంధు లాంటి కార్యక్రమాలు మరెన్నో వస్తాయన్నారు. లేదంటే ప్రతిపక్షాలకు అవకాశమిస్తే అన్ని బంద్ అవుతాయని ప్రజలకు వివరించారు.
సొంత లాభం కోసమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరాని విమర్శించారు.ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ ఎన్నారై యూకే ప్రత్యేక కార్యాచరణతో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి క్షేత్రస్థాయిలో కృషిచేస్తుందని తెలిపారు.కార్యక్రమంలో కార్యదర్శులు సత్యమూర్తి చిలుముల, సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, రాజ్ కుమార్ శానబోయిన విక్రమ్ కుమార్, తిరుమందాస్ నరేష్, రఘువరన్, హుజురాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి రియాజ్, హుజురాబాద్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గందే సాయిచరణ్, హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ సెక్రటరీ మధుకర్ రెడ్డి, హుజురాబాద్ సోషల్ మీడియా ఇంచార్జ్ గాలి రాకేష్, టీఆర్ఎస్ నాయకులు ఫయాజ్, బాబా లవన్ తదితరులు పాల్గొన్నారు.