హుజురాబాద్ లో రోజు రోజు రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. హుజురాబాద్ లో జరుగుతున్న అభివృద్దికి ఆకర్షితులైన అక్కడి ఇతర పార్టీల యువత గులాబీబాట పడుతున్నారు. తెరాసలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
దీంతో… రోజు రోజుకు హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.హుజురాబాద్ పట్టణానికి చెందిన జిల్లా బిజెపి అధికార ప్రతినిథి… కుకట్ల సంతోష్ కుమార్ యాదవ్, అనుపురం అఖిల్ గౌడ్, పొతరవేణి అనీల్ కుమార్, దాసరి రాజు, గుండెబోయిన అశోక్ యాదవ్, గుండ అఖిల్ యాదవ్ ల ఆధ్వర్యంలో హుజురాబాద్ కు చెందిన సుమారు వంద మంది బిజెపి, బిజెవైయం నాయకులు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో తెరాసలో చేరారు. కరీంనగర్ మీసేవా కార్యాలయంలో వీరికి గులాబీ కండువా కప్పిన మంత్రి గంగుల… పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
హుజురాబాద్ లో బిజెపి టౌన్ కార్యచరణలు నచ్చక… మరియు క్రమశిక్షణ లేని కొంతమంది టౌన్ కమిటీ సభ్యుల వలన… రోజు రోజుకు జరుగుతున్న రాజకీయ మార్పులతో తాము తెరాసలో చేరుతున్నామన్నారు వారు. ఇటీవల కాలంలో బిజెపి అనుసరిస్తున్న సిద్దాంతాలు నచ్చక… తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులమైన మేము… మంత్రి గంగుల సమక్షంలో తెరాసలోకి వచ్చామన్నారు. తెరాస చేపడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్ళి… ఎన్నికలు ఎప్పుడువచ్చినా… సిఎం కెసిఆర్ చూపిన అభ్యర్థిని గెలిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.