కృష్ణా నది యాజమాన్య బోర్డ్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈమేరకు నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ లేఖను పంపించారు. శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయకుండా ఆపాలని తెలంగాణ ఈఎన్‌సీ కోరారు. త్రిసభ్య కమిటీ అనుమతి లేకుండా నీటి విడుదల చేయొద్దని ఆయన పేర్కొన్నారు.
శ్రీశైలం, సాగర్‌లో గరిష్ఠ విద్యుదుత్పత్తికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పులిచింతలలో గరిష్ఠ విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలన్నారు. ఎత్తిపోతల పథకాలు, బోర్లకు విద్యుదుత్పత్తి అవసరమని వివరించారు. కృష్ణా బేసిన్ అవసరాలకే జలాలను వినియోగించాలని సూచించారు. బేసిన్ వెలుపలకు ఏపీ ప్రభుత్వం నీటిని తరలించకుండా చూడాలన్నారు.
శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్, పులిచింతలలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేపట్టడం, దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. ప్రధానమంత్రికి, కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పరిస్థితి వివరిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇటీవల లేఖ రాసింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై కొద్ది రోజులు క్రితం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లేఖ రాయగా, నిలిపివేయాలని బోర్డు తెలంగాణకు లేఖ రాసింది