హుజరాబాద్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. కరీంనగర్ జిల్లా మసీదుల కమిటీ నిర్వహణ అధ్యక్షుడు మహ్మద్ ముజహిద్ హుస్సేన్ తదితరులు హైదరబాద్ లోని బంజారాహిల్స్ ఉన్న హోం మంత్రి నివాసంలో సమావేశం నిర్వహించారు.
కరీంనగర్ జిల్లాలో మసీదుల నిర్మాణం విషయంలో వారు వినతి పత్రాన్ని హోం మంత్రి కి సమర్పించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లడుతూ….. హుజూరాబాద్ ప్రజలు లౌకిక మనస్తత్వం కలిగిన వారనివారు ఎల్లప్పుడూ లౌకిక పార్టీలకు మద్దతు ఇస్తారని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మసీదు నిర్వహణ కమిటీ ప్రతినిధుల బృందం మాట్లాడుతూ…..8000 మంది ముస్లిం ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చగా, ఓటర్ల జాబితా నుండి చాలా మంది పేర్లను తొలగించారని తెలిపారు.
ముస్లిం మైనారిటీల సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని హోంమంత్రిని అభ్యర్థించారు. స్మశానవాటికల కోసం మూడు ఎకరాల ప్రభుత్వ భూమి, వివాహ వేదికల నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని హోం మంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మిగతా సమస్యలన్నీ కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, లౌకికవాదానికి సజీవ ఉదాహరణ అని మంత్రి అన్నారు. గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నిరంతర అభివృద్ధి వైపు పయనిస్తోందని తెలియజేశారు. రాబోయే హజరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ యథావిధిగా ఘన విజయం సాధిస్తుందని హోం మంత్రి ఈ సందర్భంగా అన్నారు.