Home / SLIDER / ఈ నెల 30న టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి

ఈ నెల 30న టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి

మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈ నెల 30న టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి వచ్చే శుక్రవారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఏ పదవీ ఆశించి అధికార పార్టీలో చేరడంలేదన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడమే తన లక్ష్యమని చెప్పారు.మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో ఆయన జీజేపీలో చేరారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేయాలనుకున్నారు. అయితే ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో జూలై 26న ఆ పార్టీకి రాజీనామా చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat