కర్నాటక నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ బసవరాజు బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. బెంగుళూరులో ఉన్న రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కర్నాటక రాష్ట్ర 23వ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్‌ఆర్ బొమ్మై తనయుడే బసవరాజు బొమ్మై. బసవరాజు బొమ్మై వయసు 61 ఏళ్లు. బీఎస్ యడియూరప్ప (యెడ్డీ) ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు.
యెడ్డీలాగే బొమ్మై కూడా రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన లింగాయత్ వర్గానికి చెందినవారు. శాసనసభా పక్ష సమావేశంలో బొమ్మై పేరును యెడియూరప్ప ప్రతిపాదించగా పలువురు బలపరిచారు. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. బొమ్మైతో ప్రమాణ స్వీకారం చేయించారు.