పెరిగిన పీఆర్సీ జూన్ నెల వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. గత రెండు రోజులుగా బిల్లులు సమర్పించిన ఆయాశాఖలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో జూన్ నెల బకాయిలను ట్రెజరీ అధికారులు జమచేస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్యోగులందరికీ జూన్ నెల నుంచి పెరిగిన వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల జూన్ నెలలో పెరిగిన వేతనాలు జమకాలేదు.
ప్రభుత్వ ఆదేశాలమేరకు ఆయాశాఖలకు చెందిన అధికారులు ఉద్యోగుల బిల్లులుచేసి పే అండ్ అకౌంట్స్ అధికారులకు పంపించారు. ఇప్పటివరకు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు చెందిన ఉద్యోగుల బకాయిలు చెల్లించారు.
బుధవారంనుంచి జిల్లాల్లో ఈ చెల్లింపులు కొనసాగుతాయి. ఒకటి రెండు రోజుల్లో బకాయిల చెల్లింపులన్నీ పూర్తి కానున్నట్లు సమాచారం. జూలై వేతనాల చెల్లింపునకు సంబంధించి పెరిగిన వేతనాలతోనే వేతన బిల్లులన్నింటినీ ఆయాశాఖల అధిపతులు పే అండ్ అకౌంట్స్ అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. జూలై వేతనాలు కొత్త పీఆర్సీ ప్రకారమే వస్తాయి. పెన్షనర్లందరికీ జూన్ నెలలోనే పీఆర్సీతో ప్రకారం పెన్షన్ ఇచ్చారు.