తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు బీజేపీకి రాజీనామా చేశారు. ఈటల ముఖ్య అనుచరుడుగా ఉన్న దేశిని కోటి, ఆయన సతీమణి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించి ఈటలకు షాకిచ్చారు.
టీఆర్ఎస్ గుర్తుపై గెలిచామని, టీఆర్ఎస్‌లోనే కొనసాగుతామని కోటి, స్వప్న ప్రకటించడం గమనార్హం. ఇటీవల ఈటల ముఖ్య అనుచరుల్లో ఒక్కరైన బండా శ్రీనివాస్ కూడా ఆయన షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్ నియమించారు.
శ్రీనివాస్‌ది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్. ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్.. విద్యార్థి నాయకుని దశనుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ హుజూరాబాద్ మండల శాఖ అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగానూ శ్రీనివాస్ పనిచేశారు.