తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే నెల 5 నుంచి తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
ఆగస్టు 6 నుంచి 10 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 6 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 14న సీట్లు కేటాయించనున్నట్లు ఎస్బీటీఈటీ తెలిపింది.ఆగస్టు 23న తుది విడత పాలిసెట్ కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించింది.
23న ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్‌కు చేసుకోవాలి. 24న ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. ఆగస్టు 24, 25న వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. 27న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.
సెప్టెంబర్ 1 నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 9న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఎస్బీటీఈటీ వెల్లడించింది.