తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన (ఆహార భద్రత కార్డు) కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మీర్పేట్ హెచ్. బి. కాలనీ డివిజన్ ఫేస్ వన్ ప్లే గ్రౌండ్ ఆవరణంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్ లతో కలిసి లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
ఆహారభద్రత కార్డు నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో దాదాపు 5583 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం సంతోషించదగ్గ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎంతగానో కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు .చిలక నగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ డివిజన్లోని 758 అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, వివిధ కారణాల వలన రిజెక్ట్ అయిన 400 రేషన్ కార్డులు కూడా మంజూరు అయ్యేలా చూస్తామని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో కాప్రా ,ఉప్పల్ మండలాల తహసిల్దార్ గౌతమ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. అతిథులు కాప్రా డిప్యూటీ కమిషనర్ శంకర్ ,ఏ. ఎస్. ఓ .సరస్వతి, చిల్కనగర్ డివిజన్ కార్పరేటర్ శ్రీమతి బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ,చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి ,మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ జేరిపోతుల ప్రభుదాస్, మల్లాపూర్ కార్పొరేటర్ శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శాంతి సాయి జైన్ శేఖర్, ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శిరీష సోమశేఖర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గుండారపు శ్రీనివాస్ రెడ్డి ,టిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ లు, సీనియర్ నాయకులు ,రేషన్ డీలర్లు, సివిల్ సప్లై సిబ్బంది, మహిళలు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.