పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఐనవోలు (225), వర్ధన్నపేట (604), పర్వతగిరి (452) మండలాల లబ్దిదారులకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అర్హులైన ప్రతీ పేద, మధ్యతరగతికి చెందిన కుటుంబాలకు నూతన రేషన్ కార్డులను విడతల వారీగా అందజేయడం జరుగుతుందని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పేద మధ్యతరగతి లబ్దిదారులందరికి రేషన్ కార్డులు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
దరఖాస్తు చేసున్నప్పటికి పలు కారణాల చేత పెండింగ్ లో ఉన్న వారికి, ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి కూడా తప్పకుండా మరోసారి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నూతన రేషన్ కార్డులను పొందిన లబ్ధిదారులు ఆగస్టు నెల నుండి రేషన్ పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మర్నేని రవీందర్ రావు, ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పిటీసిలు, సివిల్ సప్లయిస్, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.