వచ్చే ఆగస్టు కల్లా చిన్నపిల్లలకు కోవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ వెల్లడించారు.
ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తమ పార్టీ ఎంపీలకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ రాజ్యసభలోనూ పిల్లల వ్యాక్సినేషన్ గురించి ఓ సభ్యుడు ప్రశ్నించారు. ఆ సమయంలో మంత్రి సమాధానం ఇవ్వబోయారు. కానీ విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఆరోగ్య మంత్రి ఇచ్చిన సమాధానం సరిగా వినపడలేదు.