ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో కాకతీయుల అద్భుత నిర్మాణ కళాఖండాలలో ఒక్కటిగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి వరల్డ్ హెరిటేజ్ కమిటీ( యునెస్కో) గుర్తింపు రావడం పైన టిఆర్ఎస్ శ్రేణులు పటకులు,బాంబులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.రామప్ప ఆలయంలో మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్,మంత్రులు గంగుల కమలాకర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి,జడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి,జల వనరుల చైర్మన్ విరమల్ల ప్రకాష్,వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కే వాసు దేవా రెడ్డి,రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఎర్వ సతిష్ రెడ్డి,స్థానిక తెరాస శ్రేణులతో కలిసి పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈయొక్క కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ ములుగు జిల్లా పాలంపేట రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.800 ఏండ్లు పైగా నిర్మాణం జరిగి చెక్కు చెదరకుండారామప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని యూనిస్కో గుర్తింపు ఇచ్చారు అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు వలస పాలకుల నిర్లక్ష్యనికి గురయింది.
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 25 దేశాల సభ్యల మద్దతు కూడగట్టడంతో గుర్తింపు సాధ్యం అయ్యింది అని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,పురపాలక,ఐటీ మాత్యులు కేటీఆర్ గారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు.అంతే కాకుండా రామప్పకు వరల్డ్ హెరిటేజ్ కమిటీ( యునెస్కో) గుర్తింపు రావడం కోసం కృషి చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్,ఎంపీ మలోత్ కవిత,ఎమ్మెల్సీ పోచమ్మ పల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కృతజ్ఞతలు తెలిపారు.