సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మహమ్మారితో ఎన్ని కష్టాలు వచ్చినా సంకోచించకుండా ఉత్సవాలను వైభవంగా నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
భక్తులు సంతోషంగా ఉండే విధంగా చూసుకొనే బాధ్యత తనదేనని, ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడుతానన్నారు. కరోనా మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టిందని, వర్షాలతో రైతులు కొంత ఇబ్బందులు పడతారన్నారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భక్తులు తనను నమ్మి పూజలు చేశారని, వారిని కాపాడే బాధ్యత తనదేనని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు