తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ దేశానికి మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు.
ఈ విషయంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు తెలిపారు సీఎం. నాడు కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా ఆలయాలు నిర్మించారని, కాకతీయ శిల్పకళా నైపుణ్యం చాలా ప్రత్యేకమైందన్నారు సీఎం కేసీఆర్.