ప్రముఖ సినీనటి జయంతి (76) కన్నుమూశారు. గత రెండేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని స్వగృహంలో మృతి చెందారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, రాజ్కుమార్, రజనీకాంత్ వంటి ప్రముఖులతో నటించిన ఆమె.. కొండవీటి సింహం, బొబ్బిలియుద్ధం, పెదరాయుడు చిత్రాల్లో నటించారు.
