తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం పట్ల రాష్ట్ర వ్యాస్తంగా సర్వత్రా హర్షం వ్యక్త మవుతున్నది. పార్టీలకు అతీతంగా దళితులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకుంటున్నారు.
దళితుల కష్టాలను తొలగించేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కృతజ్ఞతాభావంతో సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జిల్లాలోని ఇచ్చోడ మండలం ముక్తా కేలో దళితులు, స్థానిక నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.