కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ అవసరం పడే అవకాశం ఉన్నదని ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. శనివారం ఆయన ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘కొవిడ్ కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి క్షీణిస్తున్నది.
కొత్త వేరియంట్ల నుంచి రక్షణకు బూస్టర్ డోస్ అవసరం కావొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచేలా, అన్ని వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేలా రెండో తరం వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతే, బూస్టర్ డోస్ పంపిణీ జరుగుతుంది’ అని ఆయన వివరించారు.