తెలంగాణ రాష్ట్రంలో శనివారం 1,20,213 మందికి టెస్టులు చేయగా.. 647 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో ఇద్దరు మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 6,40,659కు, మరణాలు 3,780కు పెరిగాయి.
కొత్తగా 749 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాక 6.27 లక్షల మంది కోలుకున్నారు. ఇంకా 9,625 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలోనే 81 నమోదయ్యాయి.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 3,844 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆక్సిజన్‌పై 1,669, ఐసీయూపై 1,360 మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలో రెండో డోసు టీకా 1,30,333 మందికి వేశారు.