Home / SLIDER / హరిత స్ఫూర్తిని నింపాలన్నదే ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లక్ష్యం

హరిత స్ఫూర్తిని నింపాలన్నదే ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లక్ష్యం

దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో హరిత స్ఫూర్తిని నింపాలన్నదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యమని తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించాలని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సంకల్పించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణకు హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు కొనసాగింపుగా కేటీఆర్ పుట్టిన రోజు నాడు, ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల మొక్కలు నాటి బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వెంకటాద్రిపాలెం గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనంలో 2500 మందితో కలిసి 7500 మొక్కలను నాటే కార్యక్రమం, తడకమళ్ల క్రాస్ రోడ్ లో 1000 మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టినట్టు గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు తెలిపారు. పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలనే సంకల్పంతో ఎన్ఎస్పీ క్యాంపులో రామాలయం వద్ద పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామస్తులు, పట్టణ ప్రజలు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలను నాటారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగు జాడల్లో తెలంగాణ అభివృద్ది, సంక్షేమంలో తన వంతు పాత్ర పోషిస్తున్న యువ నాయకుడు కేటీఆర్ పుట్టినరోజు నాడు ఈ కార్యక్రమం నిర్వహించడాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నామని, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముక్కోటి వృక్షార్చన విజయవంతం చేశారని అన్నారు.

ముక్కోటి వృక్షార్చన లో భాగంగా మొక్కలను నాటినవారు మొక్కల సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని కోరారు. అనంతరం మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలనే ముఖ్యమంత్రి సంకల్పానికి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించే హరిత పండుగ వేదిక అవుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 28శాతం పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.

అనంతరం వెంకటాద్రిపాలెం మండల పార్టీ అధ్యక్షులు, దివంగత నేత రావులపెంట భిక్షం 19వ వర్ధంతిలో పాల్గొన్నారు. ఆయన స్మారక స్థూపానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రామకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు నాగార్జునా చారి, పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీలు ఆకుమర్తి గణేష్, సుజాత బాలు నాయక్, మాజీ ఎంపీటీసీ బారెడ్డి నాగరాజు, సర్పంచ్ లు బారెడ్డి అశోక్ రెడ్డి, బాబ్జి, రవీందర్ నాయక్, మట్టపల్లి సైదులు, మాజీ సర్పంచ్ గడగోజు ఏడుకొండలు,కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat