తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సంబరాలు తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి “ముక్కోటి వృక్షార్చన” లో భాగంగా కువైట్ లో కూడా తెరాస కువైట్ సభ్యులు కోవిద్ నిబంధనలు పాటిస్తూ కేక్ కట్ చేసి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియచేసి మంత్రి కేటీఆర్ కి చిరు కానుకను అందించడం జరిగింది.
అధ్యక్షురాలు అభిలాష మాట్లాడుతూ తెలంగాణ లో అభివృద్ధి కేవలం తెరాస ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుందని అన్నారు.మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మరియు కమిటీ సభ్యులు రవి గన్నరపు, సురేష్ గౌడ్, జగదీశ్, సుభాన్, రవి సుధగాని, సమియుద్దీన్, జమీల్, దస్తగిర్ తదితరులు పాల్గొన్నారు.