తెలంగాణ రాష్ట్ర ఐటీ & పురపాలక శాఖ మంత్రివర్యులు,తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లి గ్రామంలో మొక్కలు నాటి,కేక్ కట్ చేసిన జన్మదిన వేడుకలు నిర్వహించిన పరకాల శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు.
అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపిపి,జెడ్పిటిసి,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు,ఎంపిడిఓ, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.