కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి పరిధిలోని ఎనిమిది డివిజన్ లకు చెందిన 443 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.4,43,51,388 విలువ గల చెక్కులను ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని చింతల్ లోని కేఎంజి గార్డెన్ వద్ద కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. నిరుపేదలైన తెలంగాణ ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం వరంలాంటిదని పేర్కొన్నారు. కరోనా, అతి భారీ వరదలు వచ్చినా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసి నిధులను మంజూరు చేస్తుందని అన్నారు.
ఎలాంటి పైరవీలు, దళారుల ప్రమేయం లేకుండా అర్హులైన వారి గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్లు రావుల శేషగిరి రావు, కొలుకుల జగన్, బి.విజయ్ శేఖర్ గౌడ్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్, సురేష్ రెడ్డి, బొడ్డు వెంకటేశ్వర రావు, డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ, పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, కిషోర్ చారి, కస్తూరి బాల్ రాజ్, సత్తి రెడ్డి, భాస్కర్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.