తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి ఇటీవల భారీ వర్షానికి ఇల్లు కూలి నిరాశ్రయులైన జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన మావురం మొగిలి కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం వారి ఆర్థిక పరిస్థితులను గమనించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గడ్డమీది శ్రీనివాస్ ,మధ్యల నరేష్, వోడ్నల సురేష్, మావురం స్వామి, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు.