తెలంగాణ రాష్ర్టంలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీదే అధికారం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్‌లో అర్హులైన లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ కలిసి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేని పథకాలు మన రాష్ర్టంలో అమలవుతున్నాయని తెలిపారు.
ఇంటింటికీ నల్లా నీళ్లు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పేద వర్గాలు అభివృద్ధి చెందేలా పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అన్నం పెట్టిన కేసీఆర్‌ను మరిచిపోవద్దు.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.