Home / SLIDER / అందరికి ఆదర్శంగా నిలిచిన మంత్రి కేటీఆర్ నిర్ణయం

అందరికి ఆదర్శంగా నిలిచిన మంత్రి కేటీఆర్ నిర్ణయం

పుట్టినరోజు నాడు నలుగురికి ఉపయోగపడే మంచిపని చేయాలని పరితపించే రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, మరో మానవతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతేడాది తన పుట్టినరోజున గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమం చేపట్టి వ్యక్తిగతంగా ఆరు అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన ఆయన.. ఈ ఏడాది వందమంది దివ్యాంగులకు మూడుచక్రాల మోటార్‌సైకిళ్లు అందజేస్తానని ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌ నేతలు, ఇతరులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని ట్విట్టర్‌ వేదికగా గురువారం పిలుపునిచ్చారు. గతేడాది కేటీఆర్‌ పిలుపుతో టీఆర్‌ఎస్‌ నేతలు 100 అంబులెన్స్‌లను విరాళంగా అందజేశారు.

తన పుట్టిన రోజున పూల బొకేలు, కేకులు, కటౌట్ల కోసం డబ్బులు వృథా చేయకుండా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని ఒక మొక్క నాటాలని మరో ట్వీట్‌లో మంత్రి కేటీఆర్‌ తన అభిమానులు, మిత్రులు, ప్రజాప్రతినిధులను కోరారు. శనివారం మంత్రి కేటీఆర్‌ జన్మదినోత్సవం జరుపుకోనున్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat