Home / SLIDER / ఏరోస్పేస్ రంగంలో క్రియాశీల రాష్ర్టంగా తెలంగాణ‌ : మంత్రి కేటీఆర్

ఏరోస్పేస్ రంగంలో క్రియాశీల రాష్ర్టంగా తెలంగాణ‌ : మంత్రి కేటీఆర్

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల‌కు రాష్ర్ట‌ ప్ర‌భుత్వం అత్యంత‌ ప్రాధాన్యం ఇస్తుంద‌ని, ఈ రెండు రంగాల్లో దేశంలోనే తెలంగాణ క్రియాశీల రాష్ర్టంగా ఆవిర్భ‌వించింద‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలోని హోట‌ల్ తాజ్‌కృష్ణ‌లో టాటా బోయింగ్ 100వ అపాచీ ప్యూజ్‌లేజ్ డెలివ‌రీ వేడుక‌ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు 100 అపాచీ హెలికాప్ట‌ర్ల ప్యూజ్‌లేజ్ భాగాల‌ను టాటా సంస్థ త‌యారు చేసింది. AH-64 అపాచీ ప్యూజ్‌లేజ్ డెలివ‌రీ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

రాష్ర్ట ప్ర‌భుత్వ ప్ర‌గ‌తిశీల విధానాలు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌తో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో గత ఐదేళ్ళలో అపూర్వమైన వృద్ధిని తెలంగాణ సాధించింద‌ని తెలిపారు. వ్య‌య స‌మ‌ర్థ‌త‌లో హైద‌రాబాద్‌లోని ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం.. ఎఫ్‌డీఐ ఫ్యూచ‌ర్ ఏరోస్పేస్ సిటీస్ ర్యాంకింగ్స్ 2020లో ప్ర‌పంచంలో నంబ‌ర్ వ‌న్ ర్యాంకు సాధించింద‌ని అని కేటీఆర్ గుర్తు చేశారు. ఏరోస్పేస్ రంగంలో అపూర్వ‌మైన వృద్ధి సాధించిన నేప‌థ్యంలో కేంద్ర పౌర విమాన‌యాన శాఖ.. 2018, 2020 సంవ‌త్స‌రాల్లో బెస్ట్ స్టేట్ అవార్డును తెలంగాణ‌కు ప్ర‌క‌టించింద‌ని కేటీఆర్ తెలిపారు.

ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ‌కు అద్భుత అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. డీఆర్‌డీవో, బీడీఎల్, ఈసీఐఎల్, బీఈఎల్, హెచ్ఏఎల్ వంటి ఎన్నో సంస్థ‌ల‌కు హైద‌రాబాద్ నిల‌యంగా మారింద‌న్నారు. ఏరోస్పేస్ స‌ర‌ఫ‌రా గొలుసుకు హైద‌రాబాద్ అనుకూలంగా ఉంద‌ని ఉద్ఘాటించారు. బెంగ‌ళూరు కంటే హైద‌రాబాద్‌లోనే మెరుగైన వ‌స‌తులు ఉన్నాయ‌న్నారు. ఆదిభ‌ట్ల‌, ఎలిమినేడులో డిఫెన్స్ కారిడార్లు ఏర్పాటు చేశామ‌న్నారు. టీ హ‌బ్ ద్వారా అనేక ఇన్నోవేష‌న్లు రూపొందిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో ఉత్ప‌త్తిపై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat