సమస్యలపై ప్రజలు తనకు కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఇవాళ ఆమె పరిశీలించారు.
అనంతరం మీడియాతో మేయర్ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్ (040 23111-1111)కు 295 ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలిపారు. డయల్ 100, మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా కూడా సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని మేయర్ పేర్కొన్నారు. వరద నీటి నిల్వపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు.