ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 35,342 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. దేశవ్యాప్తంగా 38,740 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 483గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు రికవరీ కేసులు 3,12,93,062 కాగా, యాక్టివ్ కేసులు 4,05,513గా ఉన్నాయి. వైరస్ వల్ల దేశంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 4,19,470 గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్నది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ఇప్పటి వరకు 42,34,17,030 మందికి కోవిడ్ టీకాలు వేశారు.