తన బర్త్‌డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలి అని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. లేదా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పుష్పగుచ్ఛాలు, కేకులు, హోర్డింగ్‌లపై ఖర్చు పెట్టొద్దని కేటీఆర్ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్‌పై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ స్పందించారు. ముక్కోటి వృక్షార్చనలో లేదా గిప్ట్ ఏ స్మైల్‌లో భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం మీ బర్త్‌డేకు గొప్ప సత్కారం లాంటిది అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అన్నయ్యకు థ్యాంక్యూ చెబుతూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. కేటీఆర్ బర్త్‌డేను చిరస్మరణీయంగా ఉండేలా మార్చాలనుకుంటున్నామని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.