తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి తండ్రి పెద్ది రాజిరెడ్డి మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ మేరకు బుధవారం రోజున ఆయన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్న ఆయన పెద్ది రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట టి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.